ప్రతి రోజూ – ఒక కవిత – 008 – ఆమె గురించి – నా భావాల కవిత

ఆమెను చూసిన తొలి క్షణం…
నిర్మలతలోనూ ఒక గంభీరత కనిపించింది.
మాటల్లో సూటిగా ఉంటేను,
ఆమె మౌనంలో ఒక గాఢత అనిపించింది.

చూపు లో నమ్మకం,
నవ్వులో ఓ సౌమ్యత,
విజయాల్లో ఒంటరిగా సాగిన వైభవం,
కానీ హృదయంలో సహచరత్వం కోసం శోధన!

ఆమె ఊహల్లో శాస్త్రం – ప్రణాళికలూ, పరిపక్వత,
కానీ మనసులో ఓ చిన్నదైన కవిత్వం ఉంది అనిపించింది.
ఆమె మాట్లాడిన ప్రతీ మాటలో ఓ జవాబు లేదు,
కానీ ప్రశ్న అడగాలనిపించే ఆసక్తి మాత్రం ఉంది.

బంధాలపై ఉన్న విస్వాసం,
సంఘర్షణల్ని ఎదుర్కొన్న ధైర్యం,
ఆమెను చూసిన తర్వాత…
నా లోలోపల ప్రశాంతత, గౌరవం,
మరొక తలపుతో పాటు ఒక చిరునవ్వు చేరాయి.